ముగించు

జిల్లా కలెక్టర్ స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.

06/02/2021 - 07/03/2021
మున్సిపల్ కార్యాలయం, కామారెడ్డి జిల్లా

కామారెడ్డి మున్సిపాలిటీ వద్ద 06-02-2021 శనివారం నాడు స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాలీని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఐ.ఏ.ఎస్. జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని సూచించారు. తడి, పొడి చెత్తను ప్రజలు వేరు చేసి చెత్త బండి కి ఇవ్వాలని పేర్కొన్నారు. ర్యాలీలో అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఐ.ఏ.ఎస్. మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి, వైస్ చైర్ పర్సన్ ఇందుప్రియ, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, మెప్మా పిడి శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, పారిశుద్ధ్య సిబ్బంది, మెప్మా మహిళలు పాల్గొన్నారు.