ముగించు

ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు @ కామారెడ్డి.

27/09/2021 - 27/10/2021
కామారెడ్డి జిల్లా.

కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ కామారెడ్డి వారి ఆదేశాల అనుసరించి జిల్లా యువజన మరియు క్రీడా అధికారి కామారెడ్డి వారి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు సందర్బంగా తేదీ 27-09-2021 ఉదయం 9.00 గంటలకు ఇంటర్మీడియట్ (ప్రథమ , ద్వితియ ) విద్యార్థిని విద్యార్థులకు ” పర్యాటకం సమ్మిళిత వృద్ధి కోసం ” అనే థీమ్ అంశముగా వ్యాస రచన , వాక్చాతుర్యం మరియు పెయింటింగ్ తదితర విభాగాలలో ప్రతిభ పాటవ పోటీలను ప్రభుత్వ జూనియర్ కళాశాల కామారెడ్డి పట్టణం ప్రాంగణంలో నిర్వహించారు. పోటీలో ప్రథమ, ద్వితీయ విజేతలకు జిల్లా కలెక్టర్ బహుమతులు అందజేశారు. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి .