ముగించు

పారిశుద్ధ్య నిర్వహణ, ఉపాధి హామీ పనులు, పల్లె ప్రగతి పనులు, తదితర అంశాలపై రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

పారిశుద్ధ్య నిర్వహణ, ఉపాధి హామీ పనులు, పల్లె ప్రగతి పనులు, తదితర అంశాలపై రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
పారిశుద్ధ్య నిర్వహణ, ఉపాధి హామీ పనులు, పల్లె ప్రగతి పనులు, తదితర అంశాలపై రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

గ్రామాల్లో పారిశుధ్యం నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అధికారులను ఆదేశించారు.కరోనా మూడవ దశ వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో పారిశుద్ధ్యం అంశంలో అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లో ప్రతిరోజు పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని, అవసరమైన మేర హైడ్రోక్లోరిక్ స్ప్రే చేయాలని, ప్రణాళికాబద్ధంగా పారిశుద్యం పనులు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. గ్రామాల్లో  అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని మంత్రి సూచించారు. 15-18 పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభమైన నేపథ్యంలో గ్రామాల్లో అర్హులైన వారందరికీ వ్యాక్సినేషన్ తప్పనిసరిగా వేయించాలని అధికారులకు మంత్రి సూచించారు.  మెడికల్ సిబ్బంది, 60 ఏళ్ళ పైబడిన వారికి బూస్టర్ డోస్ అందజేయాలని మంత్రి తెలిపారు.

11/01/2022 31/01/2022 చూడు (457 KB)