రాజంపేట మండలం శివాయిపల్లి లో పంటల మార్పిడి విధానం పై ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
రాజంపేట మండలం శివాయిపల్లి లో పంటల మార్పిడి విధానం పై ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. | రైతులు ఆధునిక పద్ధతులను వినియోగించి కూరగాయల సాగు చేపట్టి అధిక లాభాలు పొందాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు. రాజంపేట మండలం శివాయిపల్లి లో సోమవారం పంటల మార్పిడి విధానం పై ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు పోటీ తత్వంతో కూరగాయ పంటలు పండించాలని సూచించారు. రైతులు సంఘాలు ఏర్పాటు చేసుకొని కూరగాయల సాగును చేపట్టాలని సూచించారు. |
03/01/2022 | 02/02/2022 | చూడు (541 KB) |