ముగించు

ప్రెస్ నోట్స్

ప్రెస్ నోట్స్
హక్కు వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
శ్రీ మహాత్మ జ్యోతిబా పూలే 195వ జయంతి @ కామారెడ్డి

శ్రీ మహాత్మ జ్యోతిబా పూలే 195 వ జయంతి సందర్భంగా కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్ద మహాత్మా జ్యోతిబాపూలే విగ్రహానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే పూలమాలలు వేసి నివాళులు అర్పించారు

12/04/2021 30/04/2021 చూడు (434 KB)
జిల్లా కలెక్టర్ గారు విద్యా శాఖ ఎంఇఓ లతో, మునిసిపల్ కమిషనర్లు మరియు పౌర సరఫరా అధికారులతో సమీక్షించారు.

ప్రయివేటు స్కూల్స్ ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వివరాలను మండల విద్యాశాఖ అధికారులు , ప్రధానోపాధ్యాయులు కలిసి క్షేత్ర స్థాయిలో సేకరించి వెంటనే పంపాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్, ఐ.ఎ.ఎస్ గారు విద్యా శాఖ అధికారులను ఆదేశించారు.

09/04/2021 30/04/2021 చూడు (332 KB)
ప్రయివేటు స్కూల్స్ ఉపాధ్యాయులకు , బోధనేతర సిబ్బందికి ఆర్ధిక సహాయం మీద సమీక్షా .

స్కూల్స్ తిరిగి తెరిచే వరకు ప్రయివేటు స్కూల్స్ ఉపాధ్యాయులకు , బోధనేతర సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు అన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారు మాట్లాడుతూ , పౌర సరఫరాల అధికారులు ఉపాధ్యాయులు బోధనేతర సిబ్బందికి బియ్యం పంపిణీ విధానాన్ని రేషన్ షాపుల ద్వారా పర్యవేక్షించాలని , సన్న బియ్యాన్ని సరఫరా చేయాలనీ తెలిపారు.

09/04/2021 30/04/2021 చూడు (392 KB)
ధాన్యం కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టరు గారు సివిల్ సప్లయ్ అధికారులను ఆదేశించారు.

ధాన్యం కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్, ఐ.ఎ.ఎస్ గారు సివిల్ సప్లయ్ అధికారులను ఆదేశించారు.జిల్లా సివిల్ సప్లయ్ కార్యాలయంలో ధాన్యం కొనుగోలు కంట్రోల్ రూమును జిల్లా కలెక్టరు గారు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన కంట్రోల్ రూమ్ అధికారులు , సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేసారు.

09/04/2021 30/04/2021 చూడు (302 KB)
పశుసంవర్ధక శాఖ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

జనహిత భవన్ కలెక్టరేట్‌లో పశుసంవర్ధక శాఖ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమీక్ష సమావేశంలో పశుసంవర్ధక శాఖ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ వి.లక్ష్మరెడ్డి పాల్గొన్నారు. కృత్రిమ గర్భధారణ లక్ష్యాన్ని సాధించాలి,గొర్రెల పంపిణి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలుచేయాలని తెలిపారు.

08/04/2021 08/05/2021 చూడు (380 KB)
అనుభవజ్ఞుడైన డాక్టర్ మరియు డ్రైవర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

బాన్సువాడ ఏరియా ఆసుపత్రి పంపిణీ చేయబడిన సంచార రక్త సేకరణ వాహనం నందు పనిచేయుటకు అనుభవము గల వైద్యుడు మరియు డ్రైవర్ పోస్టులకు ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికన పనిచేయుటకు దరఖాస్తులు కోరడమైనది.
అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తులను మెడికల్ సూపరింటెండెంట్, ఏరియా ఆసుపత్రి బాన్సువాడ కార్యాలయం నందు కార్యాలయపు పని వేళలలో తేదీ: 12-04-2021 నుండి 20-04-2021 వరకు సమర్పించగలరు.

12/04/2021 20/04/2021 చూడు (329 KB)
సాంఘిక సంక్షేమ , గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ విద్యాశాఖల ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలల్లో ఐదవ తరగతి ప్రవేశమునకై దరఖాస్తు చేసుకొనవలెను.

గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన ఉత్తమ విద్య అందించడానికి , వారిలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న (TSWREIS, TTWREIS, TREIS, MJPTBCWREIS) సాంఘిక సంక్షేమ , గిరిజన సంక్షేమ , వెనుకబడిన తరగతుల సంక్షేమ విద్యాశాఖల ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలల్లో VTGCET-2021 ఐదవ తరగతి ప్రవేశమునకై దరఖాస్తు చేసుకొనవలెను.
ఈ నెల 15 దరఖాస్తు చేయడానికి చివరి తేదీ.

08/04/2021 30/04/2021 చూడు (262 KB)
ఆరోగ్య కేంద్రాల వారీగా వాక్సినేషన్ పై జిల్లా కలెక్టరు గారు సమీక్షించారు.

ఆరోగ్య కేంద్రాలలో వాక్సినేషన్ పాయింట్స్ పెంచాలని, 45 సంవత్సరములు వయస్సు పైబడిన ప్రతి ఒక్కరికి వాక్సిన్ అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్, ఐ.ఎ.ఎస్ గారు వైద్య అధికారులను ఆదేశించారు.

08/04/2021 30/04/2021 చూడు (300 KB)
పౌర సరఫరాల అధికారులు, మిల్లర్లతో ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టరు గారు సమీక్షించారు.

పౌర సరఫరాల అధికారులు, మిల్లర్లతో ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టరు గారు సమీక్షించారు.ధాన్యం కొనుగోళ్లు వేగంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్,ఐ.ఎ.ఎస్ గారు అధికారులను, మిల్లర్లను ఆదేశించారు.

07/04/2021 30/04/2021 చూడు (317 KB)
మున్సిపాలిటీలు, గ్రామాలలో మంచి నీటి సరఫరాపై జిల్లా కలెక్టరు గారు సమీక్షా నిర్వహించారు.

ప్రజల త్రాగునీటికి అంతరాయం కలుగకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్, ఐ.ఎ.ఎస్ గారు మిషన్ భగీరథ , గ్రామీణ మంచి నీటి సరఫరా ఇంజనీర్లను ఆదేశించారు.

 

07/04/2021 30/04/2021 చూడు (267 KB)
జిల్లాలో కోవిడ్ ఉధృతి నివారణ చర్యలపై జిల్లా కలెక్టరు గారు సమీక్షించారు.

ప్రాథమిక , కమ్యూనిటీ , జిల్లా ఆసుపత్రుల్లో కోవిడ్ వాక్సినేషన్ పెంచాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్, ఐ.ఎ.ఎస్ గారు వైద్య అధికారులను ఆదేశించారు.

06/04/2021 30/04/2021 చూడు (396 KB)
తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు కలెక్టర్లతో కరోనా వైరస్ పై సమీక్షించారు.

కరోనా వైరస్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లకు తెలిపారు. కరోనా వ్యాప్తి ఉధృతమవుతున్నందున మంగళవారం అనగా 06-04-2021 నాడు జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తగిన సూచనలు జారీ చేసారు

06/04/2021 30/04/2021 చూడు (363 KB)
ప్రాచీన దస్తావేజులు