ముగించు

సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం, చీనూర్ గ్రామం, నాగిరెడ్డి పెట్ మండలం

దిశలు
వర్గం చరిత్ర ప్రసిద్ధమైనవి, ధార్మిక, సహజ/రమణీయమైన సౌందర్యం

సంతన వేణుగోపాల స్వామి దేవాలయం కామారెడ్డి జిల్లా లో నాగిరెడ్డి పెట్ మండల కేంద్రం లో గల చీనూర్ గ్రామం లో వెలసిన అద్బుతమైన క్షేత్రం.

700 సంవత్సరాల క్రితం నిజం రాజుల కాలం లో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు గారి స్వప్నం లో భగవత్ రూపం లో ఒక్క వ్యక్తి కనిపించి గ్రామానికి చివరలో ఉన్న కొలనులో వేణుగోపాల స్వామి విగ్రహ రూపం లో ఉన్నాడు దాన్ని వెతికి తీసి దేవాయలం నిర్మించాలని చెప్పి అతను అధ్రుస్య్మయ్యాడు. ఆ తరువాత రోజు రాజు గారు తన సైన్యం తో ఆ కొలనును దర్శించి అక్కడ వెతకమని ఆదేశించాడు. చాల ప్రయత్నం తరువాత వాళ్ళకి ఒక సుందర రెండున్నర అడుగుల వేణు గోపాల స్వామి వారిది రుక్మిణి ,సత్యభామల తో విగ్రహం  దొరికింది.

స్వామి వారి విగ్రహాల తో పాటు శ్రీ సుదర్శన్ పెరుమాళ్,శ్రీమన్నారాయణ విగ్రహాలు దొరుకగ వాటిని తీసుకోని వచ్చి రాజు గారు ఒక అద్బుతమైన దేవాలయాన్ని నిర్మించి స్వామి వారి ని ప్రతిష్టించారు అని స్థల పురాణం, స్వామి వారి విగ్రహాల తో పాటు నమ్మాళ్వార్, భగవద్ రామానుజుల విగ్రహాలు ప్రతిష్టించారు. స్వామి వారికి జరిగే పూజలు,విశేష పర్వదినాల్లో జరిగే కార్యక్రమాలు ఎంతో రమణీయంగా,కన్నుల పండుగగా ఆగమ శాస్త్రాల ప్రకారం జరుగుతాయి.
 
ఎవరైతే ఈ క్షేత్రం లో స్వామి వారిని మానస వాచా ఆ స్వామి వారిని కొలిచి పూజిస్తారో వాళ్ళకి మంచి సంతానాన్ని ప్రసాదిస్తారని అనాదిగా భక్తుల నమ్మకం. స్వామి వారి కళ్యాణం అంగ రంగ వైభవంగా జరుగుతుంది.స్వామి వారి కళ్యాణ మహోత్సవం లో పాల్గొనే వారికి కోరిన కోరికలు నేరవరుతాయని నమ్మకం.
 

ఛాయా చిత్రాల ప్రదర్శన

  • సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం, చీనూర్ గ్రామం, నాగిరెడ్డి పెట్ మండలం
  • సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం, చీనూర్ గ్రామం, నాగిరెడ్డి పెట్ మండలం
  • సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం, చీనూర్ గ్రామం, నాగిరెడ్డి పెట్ మండలం

ఎలా చేరుకోవాలి?:

గాలి ద్వారా

ప్రస్తుతం, కామారెడ్డిలో ఫంక్షనల్ విమానాశ్రయం లేదు. 176 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీప విమానాశ్రయం.

రైలులో

మీరు రైలులో ప్రయాణించడం ద్వారా సికింద్రాబాద్ (ఎస్సీ) లేదా కాచిగూడ (కెసిజి) నుండి కామారెడ్డికి చేరుకోవచ్చు. సికింద్రాబాద్ నుంచి కామారెడ్డి రైలుకు సుమారు 2 గంటలు 15 నిమిషాలు పడుతుంది.

రోడ్డు ద్వారా

చీనూర్ గ్రామం నుండి నాగిరెడ్డి పెట్ మండల కేంద్రం 6కిలోమీటర్ల దూరంలో, కామారెడ్డి పట్టణానికి 43 కిలోమీటర్ల దూరంలో ఉంది. మెదక్ నుండి 23కిలోమీటర్ల దూరంలో ఉంది. మరియు రహదారి ద్వారా చేరుకోవచ్చు.

దృశ్యాలు