ముగించు

డెయిరీ డెవలప్మెంట్

డెయిరీ డెవలప్మెంట్ శాఖ గురించి

జిల్లాలోని బాన్సువాడ కేంద్రములోని సోమేశ్వర గ్రామములో తేది: 13-10-2016 న పాల శీతలీకరణ కేంద్రమునకై శంఖుస్థాపన జరిగినది. తాడ్వాయి మండలములోని ఎర్రపహాడ్ గ్రామములో పాల ఉత్పత్తి అధికంగా ఉన్నందున దానిని పాల సేకరణ కేంద్రము నుండి పాల శీతలీకరణ కేంద్రంగా మార్చుట అవసరమై ఉన్నది.ఇక్కడ పాలు సంభావ్యత చాలా ఎక్కువగా ఉంటుంది.అలాగే జుక్కల్, మోతే గ్రామములలో పాల శీతలీకరణ కేంద్రముల ఏర్పాటుకు అవకాశం కలదు.

జిల్లాలో తెలంగాణ పాడి అభివృద్ధి శాఖ ఫెడరేషన్ జిల్లా కేంద్రం కామారెడ్డిలో కలదు. ప్రతి దినము సుమారు 20వేల లీటర్ల పాలు ఈకేంద్రం ద్వారా సరఫరా గావింపబడును. ఇదీయే గాక జిల్లలో 10 పెద్ద పాల శీతలీకరణ యూనిట్లు దీని పరిదిలోనున్నది. ప్రస్తుతం ప్రతి దినం 35000 లీటర్లు 99 కేంద్రముల నుండి సీకరించబడుచున్నవి. 7354 పాల సరఫరాదారులు ఈ పరిశ్రమ ద్వారా లబ్ధి పొందుచున్నారు.

వెబ్‌సైట్ :

తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్- http://tsdairy.telangana.gov.in/