జిల్లా గురించి
కామారెడ్డి అనే పేరు 1600 నుండి 1640 సంవత్సరములలో దోమకొండ కోటను పరిపాలించిన “చిన్న కామిరెడ్డి” నుండి వచ్చినది. ఈ ప్రదేశము పూర్వము కోడూరుగా పిలువబడెది. ప్రస్తుతం కిష్టమ్మ గుడి దగ్గర ఈ గ్రామము ఉన్నది. హరిజన వాడలో కోడూరు హనుమండ్ల గుడి ఉండెది. కామారెడ్డి లో అత్యంత ప్రాచీనమైన చరిత్ర కల్గిన దేవాలయమిది.