ముగించు

జిల్లా పరిశ్రమలు

జిల్లా పరిశ్రమల శాఖ గురించి

కామారెడ్డి జిల్లా పాక్షికంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందియున్నది. ముఖ్యంగా వ్యవసాయిక అనుబంధ పరిశ్రమల స్థాపనకై ఇంకను అనేక అవకాశములు కలవు. జిల్లాలో వరి, మొక్కజొన్న, పసుపు, సోయా పంటల అధికంగా సేధ్యము అవుతున్నందున వీటికి అనుబంధంగా పరిశ్రములు నెలకొల్పబడే అవకాశం కలదు.

వివిధ పరిశ్రమల స్థాపనకై అవకాశములు క్రింది విధముగా నున్నవి:

ఆహార పంటల పరిశ్రమలు:

జిల్లాలో ప్రధానంగా అనేక రైసుమిళ్ళు, పారా బాయిల్ రైసుమిళ్ళు, నూనె ఉత్పత్తి పరిశ్రమలు, చిన్న చిన్న పప్పు ధాన్య పరిశ్రమలు మొక్కజొన్న ధాన్య పరిశ్రమలు, బేకరీలు, చాక్లెట్ల పరిశ్రమలు. పచ్చళ్ళ పరిశ్రమలు మరియు పశువుల దాణా పరిశ్రమలకు అవకాశములు కలవు.

సేవా పరమైనవి:

వ్యవసాయ పనిముట్లు, వ్యవసాయ సంబంధమైన మోటార్లు, ట్రాక్టర్లు, ఆయిల్ ఇంజన్లు మరియు మోటారు సేవలు.

చేనేత పరిశ్రమలు:

తయారీ దుస్తులు, సేవ దుస్తులు, బడికి సంబందించిన చిన్న పిల్లల దుస్తులు, చీరలు, స్పిన్నింగ్ మిల్లుల మొIIనవి.<>/p

రబ్బరు మరియు ప్లాస్టిక్ పరిశ్రమలు;

ప్లాస్టిక్ తిరిగి తయారీ, ప్లాస్టిక్ సంచీలు, కవర్లు, ఎలక్ర్టికల్ పరికరములు, పాలిధీన్ సంచులు ప్లాస్టిక్ గాజులు, టైర్లు రీ ట్రేడింగ్.

నిర్మాణ సంబంధమైన పరిశ్రమలు:

అల్యూమినియం పరికరములు, సిమెంటు హాల్ ఇటుకలు, మట్టి ఇటుకలు, గృహ సంబంధమైన సెంట్రింగ్ పరికరములు, తేలికైన ఇటుకల తయారీ.

రసాయన మరియు ఇతర పరిశ్రమలు:

నల్లని మరియు తెల్లని ఫినాయిల్ తయారీ, ఆహార పరికరముల శుభ్ర పరిచే పౌడర్లు, ఆసిడ్లు మొIIనవి.

కాగిత సంబంధమైన పరిశ్రమలు:

నోటు పుస్తకములు, రిజిష్టర్లు, గ్రీటింగ్ కార్డులు చిరునామా కార్డులు, వివాహా శుభలేఖ కార్డులు కాగితపు నేప్కిన్సు మొIIనవి.

ఇతర పరిశ్రమలు:

స్టీలు మరియు అల్యూమినియం ఫర్నిచర్ల తయారీకంప్యుటర్ పరికరములు, పోషకములు కల్గిన మంచినీటి శుభ్రత.