ఎస్.సి అభివృద్ధి
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కార్యాలయము
- అంబేడ్కర్ విదేశీ విద్యానిది పథకము 2020-21:
ప్రతిభావంతులై ఉండికూడా విదేశాలలో చదివే అవకాశం లేని యస్సీ విద్యార్ధులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వము అంబేడ్కర్ విదేశీ విద్యానిధి పధకమును అమలు చేస్తున్నది.
మెడిసిన్, ఇంజనీరింగ్, ఫార్మసీ, నర్సింగ్, సోషల్ సైన్స్ మరియు హుమనీటిస్ మొదలగు కోర్సులలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యస్సీ విద్యార్థినివిద్యార్థులకు అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, జెర్మనీ, జపాన్, న్యూజీలాండ్, మరియు సౌత్ కొరియా దేశాలలోని పేరొందిన విశ్వవిద్యాలయాలలో పి.జి. మరియు ఉన్నత స్థాయీ విద్య అభ్యసించుటకు ఆర్థిక సహాయం అందిస్తారు.
- ఈ పథకము క్రింద ఎంపిక అయిన వారికీ రెండు విడుతలలో మొత్తం రూ. 20 లక్షలు ఆర్థిక సహాయం అందచేయబడును.
- అభ్యర్ధుల వయస్సు (35) సంవత్సరంలలోపు ఉండాలి.
- తల్లిదండ్రుల కుటుంభ వార్షిక ఆదాయం 5లక్షల లోపు ఉండవలెను.
- అభ్యర్దులకు డిగ్రీ స్థాయి లో 60% శాతానికి పైగా మార్కులు, టోఫెల్ లో 60 మార్కులు, ఐఈఎల్‌టిఎస్ లో 6.0 స్కోర్,
జి ఆర్ ఈ లో 260, జి మ్యాట్ లో 500 లు అంతకన్నా ఎక్కువ ఉన్నవారికే అవకాశం.
- 2019-20 విద్యా సంవత్సరంలో కామారెడ్డి జిల్లానుండి (1) విద్యార్థి ఎంపికవడం జరిగింది.
- 2020-21 విద్యా సంవత్సరంలో ఎంపిక జరుగుచున్నది.
- బెస్ట్ అవైలబుల్ స్కీమ్:
ఈ పథకము ద్వారా ప్రతి సంవత్సరము నాన్ రెసిడెన్షియల్ (డే-స్కాలర్) కేటగిరీ క్రింద 1వ తరగతిలో (27) మంది యస్సీ విద్యార్థులకు మరియు రెసిడెన్షియల్ కేటగిరీ క్రింద 5వ తరగతిలో (27) మంది యస్సీ విద్యార్థులకు ప్రవేశము కల్పించబడును. జిల్లా నందు ఈ పథకము క్రింద (3) పాఠశాలలను ఎంపిక చేయడమైనది అవి 1. అభ్యుదయ పాఠశాల, దోమకొండ. 2. చైతన్య హై స్కూల్, చిన్నమల్లారెడ్డి. 3. వెంకట సాయి విద్యానికేతన్ హై స్కూల్, నస్రుల్లాబాద్.
- హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (HPS) స్కీమ్:
ఈ పథకము క్రింద ప్రతి సంవత్సరము హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నందు 1వ తరగతిలో ప్రవేశము కొరకు జిల్లా నుండి ఇద్దరు (2) యస్సీ విద్యార్థులకు ప్రవేశము కల్పించబడును. 2020-21 విద్యాసంవత్సరమునకు ఇద్దరు (2) విద్యార్థులను ఎంపిక చేసి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నందు ప్రవేశము కొరకు కమిషనర్ (షె.కు.అ.శాఖ), హైదరాబాద్ గారికి వివరములు పంపనైనది.
- కార్పోరేట్ కళాశాల ప్రవేశాలు 2020-21:
2020-21 విద్యా సంవత్సరంలో కార్పోరేట్ ఇంటర్మీడియేట్ కళాశాల లలో ప్రవేశము కొరకై ఇ-పాస్ వెబ్ సైట్ నందు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోనుటకు పత్రిక ప్రకటన జారీచేయనైనది. ఎంపికైన విద్యార్థులకు కార్పోరేట్ కళాశాలలలో ప్రవేశము కల్పించడబడును.
- కులాంతర వివాహములు:-
ఈ పథకము క్రింద ధరఖాస్తు చేసుకొనుటకు కులాంతర వివాహము చేసుకున్నా దంపతులలో ఒకరు తప్పనిసరిగా యస్సీ కులమునకు చెందినవారై ఉండాలి. తేది: 30-10-2019 తర్వాత కులాంతర వివాహము చేసుకున్నా దంపతులకు రూ.2.50 లక్షలు మంజూరు చేయబడును. ఈ పథకము క్రింద ప్రోత్సాహకం పొందుటకు ఆన్ లైన్ ద్వారా telanganaepass.cgg.gov.in అను వెబ్ సైట్ నందు ధరఖాస్తు చేసుకోవలెను.