ముగించు

జిల్లా కలెక్టరేట్‌లో లీడ్ ఎర్త్ లీడర్స్ కాన్క్లేవ్ కార్యక్రమం

19/12/2024 - 18/01/2025
కలెక్టరేట్ కార్యాలయం, కామారెడ్డి

కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ మరియు తెలంగాణ విద్యా శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న స్కూల్ ఎర్త్ క్లబ్ – యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రాం లో భాగంగా కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో లీడ్ ఎర్త్ లీడర్స్ కాంక్లేవ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి

గౌరవ అతిథి, కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ సిజిఆర్ సంస్థ, విద్యార్థులను భాగస్వాములను చేసి చేపట్టిన పర్యావరణ కార్యక్రమాలను అభినందించారు. విద్యార్థులందరూ వారి వారి పాఠశాలల్లో, పల్లెల్లో కలిసి కట్టుగా పర్యావరణ సంరక్షణలో పాల్గొని జిల్లాని ఉన్నత స్థాయిలో ఉంచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సిజిఆర్ అధ్యక్షురాలు లీలా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఒక గొప్ప సంకల్పంతో ప్రారంభించిన యంగ్ ఎర్త్ లీడర్స్ కార్యక్రమం ఈ స్థాయిలో విజయవంతం కావాడానికి ముఖ్య కారణం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే అని కొనియాడారు. విద్యార్థులతో మాకు ఈ సమన్వయం ఇలాగే ఉంటే త్వరలోనే రాష్ట్రాన్ని పచ్చగా మార్చగలమని ధీమా వ్యక్తం చేశారు.

ఆచార్య ఉపేందర్ రెడ్డి, వందేమాతరం రవీంద్ర, ZPHS భిక్నూర్ HM వారి వారి పర్యావరణ ఉపన్యాసాలతో విద్యార్థులకి చైతన్యం కలిగించారు.

ఈ కార్యక్రమానికి అతిథులుగా, జిల్లా విద్యాశాఖాధికారి ఎస్. రాజు, డిఆర్డిఓ ఎం. సురేందర్, ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ రామకృష్ణ, జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ ఎం. జ్యోతి, డిఏఓ తిరుమల ప్రసాద్ లు హాజరయ్యారు.

జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరాం రెడ్డి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

ఈ కార్యక్రమంలో సిజిఆర్ వ్యవస్థాపకులు లక్ష్మారెడ్డి, సిజిఆర్ రాష్ట్ర కార్యదర్శి యానాల వెంకట్ రెడ్డి, సీజీఆర్ సభ్యులు అన్నమయ్య, అనుదీప్, జ్ఞానేశ్వర్, నగేష్, నల్సార్ విశ్వవిద్యాలయ విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలల టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.