సి.ఏం. కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు ముగింపు కార్యక్రమం కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు.
ముఖ్యమంత్రి కప్ 2024 రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయిన క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరచి బహుమతులు తీసుకరావాలనీ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సి.ఏం. కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు ముగింపు కార్యక్రమం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించి విజేతలకు మెడల్స్ , ప్రశంసా పత్రాలను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సి.ఏం. కప్ 2024 సందర్భంగా నిర్వహించిన క్రీడల్లో విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 7,8 తేదీల్లో గ్రామ పంచాయతీ, 10 నుండి 12 తేదీల్లో మండల, మున్సిపల్ స్థాయిల్లో, 16 నుండి 21 వరకు జిల్లా స్థాయిల్లో క్రీడలు నిర్వహించడం జరిగాయని, 8000 మంది క్రీడాకారులు గ్రామ స్థాయిల్లో 13 ఈవెంట్లలో పాల్గొన్నారని, ఒకవేయి మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొననున్నారని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో కామారెడ్డి జిల్లా క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరచి బహుమతులు తీసుకురావాలని ఆకాంక్షించారు.