ముగించు

దేశీయ

Fit India Freedom Run 2.0 as Part of Azadi Ka Amrith Mahosthav

స్వతంత్ర భారత అమృత మహోత్సవాలలో భాగంగా ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0.

ప్రచురణ: 04/09/2021

ఆజాది కా అమృత మహోత్సవంలో భాగంగా జిల్లాలోని ఇందిరాగాంధీ స్టేడియం నుండి ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0 ని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.

మరింత
National Deworming Eradication Program from August 25th to 31st August

ఆగష్టు 25 నుండి 31 వరకు జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం.

ప్రచురణ: 23/08/2021

జిల్లాలో నులి పురుగుల నిర్మూలన  కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఐఎఎస్ గారు అన్నారు.  సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నులిపురుగుల మాత్రల పంపిణీపై అవగాహన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ, ఐ సి డి ఎస్, విద్య, వైద్య, గ్రామపంచాయతీ అధికారులు సమన్వయంతో  మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని సూచించారు.దయచేసి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరింత
ఆజాది కా అమృత్ మహోత్సవ్ సంధర్బంగా జిల్లా గ్రామీణ రహదారి సెమినార్ వారోత్సవాల్లో భాగంగా ఆర్కే డిగ్రీ కాలేజీలో సెమినార్.

ఆజాది కా అమృత్ మహోత్సవ్ సంధర్బంగా నిర్వాహించిన జిల్లా గ్రామీణ రహదారి సెమినార్ వారోత్సవాల్లో భాగంగా ఆర్కే డిగ్రీ కాలేజీలో సెమినార్.

ప్రచురణ: 21/08/2021

ఆజాది కా అమృత్ మహోత్సవం సందర్బంగా నిర్వాహించిన జిల్లా గ్రామీణ రహదారి సెమినార్ వారోత్సవాల్లో బాగంగా ఆర్‌కె డిగ్రీ కాలేజీలో 19 ఆగస్టు 2021 అనగ గురువారం రోజున సెమినార్ నిర్వహించడం జరిగింది. జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ సాయగౌడ్ గారు ముఖ్య అతిధిగా పాల్గోన్నారు. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి .

మరింత
ఇందిరాగాంధీ స్టేడియంలో 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.

ప్రచురణ: 16/08/2021

ఇందిరాగాంధీ స్టేడియంలో 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరింత
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 130 వ జయంతి @ కామారెడ్డి

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 130వ జయంతి @ కామారెడ్డి.

ప్రచురణ: 15/04/2021

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాలను ప్రతి ఒక్కరు పాటించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే గారు అన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 130 వ జయంతి పురస్కరించుకుని కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరింత
స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాలీ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఐ.ఏ.ఎస్

జిల్లా కలెక్టర్ స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.

ప్రచురణ: 06/02/2021

కామారెడ్డి మున్సిపాలిటీ వద్ద 06-02-2021 శనివారం నాడు స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాలీని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఐ.ఏ.ఎస్. జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని సూచించారు. తడి, పొడి చెత్తను ప్రజలు వేరు చేసి చెత్త బండి కి ఇవ్వాలని పేర్కొన్నారు. ర్యాలీలో అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఐ.ఏ.ఎస్. మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి, వైస్ చైర్ పర్సన్ ఇందుప్రియ, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, మెప్మా […]

మరింత
Pulse Polio Program Inaugurated by District Collector in District Area Hospital

కామారెడ్డి ఏరియా ఆసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.

ప్రచురణ: 01/02/2021

కామారెడ్డి ఏరియా ఆసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. పల్స్ పోలియో ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి, జిల్లా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్, కామారెడ్డి మున్సిపాల్ చైర్‌పర్సన్ మరియు వైస్ చైర్‌పర్సన్‌లు పాల్గొన్నారు.

మరింత
“జిల్లా స్థాయిలో డిజిటల్ గవర్నెన్స్‌లో ఎక్సలెన్స్” పై వెబ్‌నార్ నిర్వహించిన డైరెక్టర్ జనరల్ ఎన్‌సిజిజి..

“ఎక్సలెన్స్ ఇన్ డిజిటల్ గవర్నెన్స్ – డిస్ట్రిక్ట్ లెవెల్” పై వెబ్‌నార్ నిర్వహించిన ఎన్‌సిజిజి డైరెక్టర్ జనరల్.

ప్రచురణ: 21/01/2021

“ఎక్సలెన్స్ ఇన్ డిజిటల్ గవర్నెన్స్ – డిస్ట్రిక్ట్ లెవెల్” పై వెబ్‌నార్ భారత ప్రభుత్వ డీఏఆర్పీజి అదనపు కార్యదర్శి శ్రీ వి. శ్రీనివాస్ మరియు నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎన్‌సిజిజి) డైరెక్టర్ జనరల్ అధ్యక్షతన నిర్వహించారు.దయచేసి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరింత
జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశం

పల్స్ పోలియో ప్రోగ్రాం మరియు కోవిడ్ -19 వ్యాక్సిన్ విడుదల మరియు పంపిణీ సంసిద్ధత పై జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశం

ప్రచురణ: 23/12/2020

పల్స్ పోలియో ప్రోగ్రామ్ మరియు కోవిడ్ -19 వ్యాక్సిన్ విడుదల మరియు పంపిణీ సంసిద్ధత పై జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశం జనహిత భవనం లో నిర్వహించారు. 2021 ప్రారంభంలో టీకాలు అందుబాటులోకి రావచ్చు అని,  టీకాలను పంపిణి చేయడానికి 1 వ్యాక్సినేటర్ ఆఫీసర్ 1 వాక్సినేషన్ ఆఫీసర్స్ 4 టీం గా ఏర్పడి టీకాలను పంపిణీ చేస్తారని భావిస్తున్నారు.

మరింత
గిరిజనుల సంక్షేమం కోసం

గాంధారి మండల కేంద్రంలో కొత్తగా నిర్మించిన కస్తూర్బా గాంధీ జూనియర్ కళాశాల అదనపు భవనం ప్రారంభోత్సవం.

ప్రచురణ: 23/12/2020

గిరిజనుల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి పథకాలతో గౌరవ ముఖ్యమంత్రి అహర్నిశలు పాటుపడుతున్నారని,వారి ఆర్ధిక,సామజిక బలోపేతమే ఆయన లక్ష్యమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర స్త్రీ మహిళ శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు. మంగళవారం నాడు గాంధారి మండల కేంద్రంలో ఒక కోటి 54 లక్షలతో నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ జూనియర్ కాలేజీ అదనపు భవనాన్ని మంత్రి ప్రారంభించారు.అనంతరం 5 కోట్ల నిధులతో ఏకలవ్య మోడల్ గురుకుల బాలుర […]

మరింత
వైకల్యం శరీరానికి మాత్రమే కాని ఆత్మకు కాదు

జిల్లా కలెక్టరు డాక్టర్ ఏ.శరత్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎన్ శ్వేత ఆదిత్య మెహతా ఫౌండేషన్ కు చెందిన 30 మంది దివ్యాంగ సైకిలిస్టులకు హృదయపూర్వక అభినందలతో స్వాగతం పలికారు.

ప్రచురణ: 18/12/2020

ఆదిత్య మెహతా ఫౌండేషన్ కు చెందిన 30 మంది దివ్యాంగ సైకిలిస్టులు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సైకిలింగ్ చేస్తూ మార్గమధ్యలో కామారెడ్డికి చేరుకున్నారు. వారికి గురువారం జనహిత భవన్లో జిల్లా కలెక్టరు డాక్టర్ ఏ.శరత్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎన్ శ్వేత హృదయపూర్వక అభినందలతో స్వాగతం పలికారు.

మరింత