ప్రెస్ నోట్స్
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
జిల్లా కలెక్టర్ ఐకెపి అధికారులతో సమీక్ష నిర్వహించారు. | సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి వల్ల కలిగే ప్రయోజనాలను స్వయం సహాయక సంఘాల మహిళలకు వివరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం ఐకెపి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఐకేపీ ద్వారా గ్రామాల్లో సర్వే చేపట్టి సోలార్ యూనిట్లు కావలసిన మహిళల పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. |
22/12/2021 | 21/12/2022 | చూడు (433 KB) |
జిల్లా కలెక్టర్ టిఎస్ బి పాస్, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. | పట్టణాల్లో అక్రమ కట్టడాలు నిర్మిస్తే ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు వెళ్లి పంచనామా నిర్వహించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం టిఎస్ బి పాస్, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎక్కడైనా అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే ఎన్ఫోర్స్మెంట్ బృందం అక్కడికి వెళ్లి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. |
22/12/2021 | 21/12/2022 | చూడు (429 KB) |
కామారెడ్డి పట్టణంలోని కాకతీయనగర్, డ్రైవర్స్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. | కామారెడ్డి పట్టణంలోని కాకతీయనగర్, డ్రైవర్స్ కాలనీ లోని అంగన్వాడీ కేంద్రాలను మంగళవారం జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. అంగన్ వాడి కేంద్రాలలో బలహీనంగా ఉన్నా పిల్లల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారి బరువులను తూకం వేయించారు. ఎత్తుకు తగిన విధంగా బరువు ఉండే విధంగా పిల్లలకు నాలుగు నెలలపాటు అదనపు ఆహారం ఇవ్వాలని సూచించారు. బలహీనంగా ఉన్న గర్భిణీలకు అదనంగా పౌష్టికాహారం అందించాలని ఐసిడిఎస్ అధికారులను ఆదేశించారు. |
21/12/2021 | 21/12/2022 | చూడు (537 KB) |
కామారెడ్డి జిల్లా ప్రజ పరిషత్ సమావేశాలు. | జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంగం సమావేశాలు 28.12.2021 నుండి 29.12.2021 వరకు జిల్లా ప్రజ పరిషత్ సమావేశ హాల్ లో జరుగుతాయి, అధికారులకు మరియు గౌరవనీయ సభ్యులు హాజరు అవుతారు. |
20/12/2021 | 31/12/2022 | చూడు (228 KB) |