ఎస్.సి. కార్పొరేషన్ విజయ గాథలు
ఎస్.సి. కార్పొరేషన్ –కామారెడ్డి జిల్లా– పథకములు– విజయాలు:
1.భూమి కొనుగోలు పథకము కింద నిరుపేద దళిత మహిళా లబ్దిదారులకు మాచారెడ్డి మండలం, ఘన్ పూర్ గ్రామస్తులకు ప్రతి లబ్దిదారునకు 3 ఎకరాల భూమి ఇవ్వడం జరిగినది.మరియు ఇట్టి భూమిని వారి పేరున రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమం లో పాల్గొన్న ఎస్ .సి. కార్పొరేషన్ కార్య నిర్వాహాక సంచాలకులు శ్రీ G. బాలయ్య గారు.
2.ఎస్.సి. లబ్దిదారులకు వారికీ ఇచ్చిన 3 ఎకరాల భూమిలో నీటి వసతి కొరకు బోర్ మోటార్ ఇవ్వడం జరిగినది. అనగా బోర్, డ్రిల్లింగ్ చేయడం జరిగినది. నందివాడ గ్రామం, తాడ్వాయి మండలం మరియు తిమ్మానగర్ గ్రామం,పిట్లం మండలం లో పరిశీలిస్తున్న ఎస్ .సి. కార్పొరేషన్ కార్య నిర్వాహాక సంచాలకులు శ్రీ G. బాలయ్య గారు.
3.తిమ్మానగర్ గ్రామము, పిట్లం మండలం లో ఎస్.సి. లబ్దిదారునకు బోర్ మోటార్ బిగించటం జరిగిన సందర్బం లో ఎస్.సి. కార్పొరేషన్ కార్య నిర్వాహాక సంచాలకులు శ్రీ G. బాలయ్య గారు.
4.సింగీతం గ్రామము లో ఎస్.సి. లబ్దిదారులతో భూమి కొనుగోలు పథకము క్రింద ఎకరము భూమి ని, ఎంత ధరకు కొనుగోలు చేయవచ్చుఅని , కామారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీ ఎ. శరత్ I.A.S. గారు, గ్రామస్తులు మరియు ఎస్.సి. లబ్దిదారులతో మాట్లాడుతున్నారు.
5.నిజాంసాగర్ మండలం, షేర్ఖాన్ పల్లి గ్రామములో భూమి కొనుగోలు పథకము క్రింద భూమిని పరిశీలిస్తున్న సంయుక్త కలెక్టర్ శ్రీ యాదిరెడ్డి గారు
6.ఎస్.సి. లబ్దిదారులకు ఆర్ధిక సహాయం పథకము క్రింద 2017-18 సం. లో,(యూనిట్ ధర పది లక్షలు) టాక్సీ కారు ను, భట్టు ఎల్లయ్య అక్కాపూర్ గ్రామం, మాచారెడ్డి మండలం గారికి , పంపిణి చేస్తున్న బ్యాంకు మేనేజర్ మరియు ఎస్.సి. కార్పొరేషన్ కామారెడ్డి కార్య నిర్వాహక సంచాలకులు.
7.ఎస్.సి. లబ్దిదారులకు స్వయం ఉపాది పథకము కింద, పెర్కిట్(గ్రా),ఆర్మూర్ ప్రాంగణంలో 25 మంది లబ్దిదారు లకు టైలరింగ్ లో శిక్షణ ఇచ్చి, కుట్టు మిషిన్లు ను పంపిణి చేస్తున్న ఎస్.సి. కార్పొరేషన్ కామారెడ్డి, కార్య నిర్వాహాక సంచాలకులు, శ్రీ గుర్రం బాలయ్య గారు.
8.లచ్చపేట గ్రామం, మాచారెడ్డి మండలంలో భూమి లేని నిరుపేద ఎస్.సి. లబ్దిదారులకు భూమి పంపిణి కొరకు , కొనుగోలు చేసిన భూమిని పరిశీలిస్తున్న sc కార్పొరేషన్, హైదరాబాద్ జనరల్ మేనేజర్ గారు.
9.లచ్చపేట గ్రామం, మాచారెడ్డి మండలంలో మొదటి పంటకు ఆర్ధిక సహాయం చెక్కును పంపిణి చేస్తున్న గౌరవనీయ కామారెడ్డి నియోజక వర్గ శాసన సభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ గంప గోవర్ధన్ గారు.
10.గ్రౌన్డింగ్ మేళా కార్యక్రమంలో లబ్దిదారుకు చెక్కు ను పంపిణి చేస్తున్న గౌరవనీయ సభాపతి & బాన్సువాడ నియోజకవర్గం శాసన సభ్యులు శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు.
11.లింగంపేట్ మండలం లో జరిగిన గ్రౌన్డింగ్ మేళ కార్యక్రమంలో గౌరవనీయ ఎల్లారెడ్డి నియోజక వర్గ శాసన సభ్యులు శ్రీ జాజుల సురేందర్ గారు లబ్దిదారులకు చెక్కు లను పంపిణి చేస్తున్న దృశ్యం.
12.జుక్కల్ మండలం లో లబ్దిదారునికి కారు తాళంచెవి ని అందచేస్తున్న గౌరవనీయ జుక్కల్ నియోజక వర్గ శాసన సభ్యులు శ్రీ హన్మంత్ షీండే గారు