పశు వైద్య మరియు పశు సంవర్ధక శాఖ
జిల్లాలో అపారమైన పశు సంపద ఉన్నది. పాడి పశువుల పెంపకము సన్న, చిన్న కారు రైతులకు అదనపు ఆదాయాన్నే కాకుండా నిరుపేద వ్యవసాయ కూలీలకు జీవనోపాధిని కల్పిస్తున్నది. గొర్రెల పెంపకములో పాలమూరు జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉన్నది. మన జిల్లాకు చెందిన గొర్రెల కాపరులు తరచూ వలస వెళ్ళినా, గొర్రెల పెంపకము లాభ సాటిగా ఉన్నది. గ్రామీణ మహిళలు కోళ్ల పెంపకము ద్వారా తమ పిల్లలకు గుడ్ల రూపంలో బలవర్ధక ఆహారాన్ని అందించడం జరుగుతుంది. బ్రాయిలర్ మరియు లేయర్ ఫారంలలో కూడా కోడి మాంసముమరియు గుడ్ల ఉత్పత్తిలో మన జిల్లా ముందంజలో ఉంది. పశు పోషణ గ్రామీణ రైతుల జీవనోపాధిని మెరుగు పరుస్తున్నదనడంలో సందేహము లేదు.
పశు సంవర్ధక శాఖ యొక్క ముఖ్య ఉద్దేశ్యము సమస్త మానవ జాతికి బలవర్ధక ఆహారమైన పాలు, మాంసము మరియు గుడ్ల రూపములో అందించడము. దీనికి గాను ప్రస్తుతము రైతుల దగ్గర ఉన్న నాసిరకం పశువుల జాతి అభివృద్ది వ్యాధి నిరోధక శక్తి పెంచడము మరియు సమర్థవంతంగా పాడి పశువుల పోషణ ద్వారా రైతుల నికర ఆదాయాన్ని పెంచడము. అంతేకాకుండా గ్రామీణ ప్రాంత రైతుల ఆర్ధిక అభివృద్ధికి ప్రభుత్వం ద్వారా అమలు చేయబడే వివిధ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం.
పశుసంవర్ధక శాఖ యొక్క చార్టర్ క్లుప్తంగా:
- కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా జాతి అభివృద్ది చేసి తద్వారా పాడి పశువుల యొక్క ఉత్పత్తి సామర్థ్యాని పెంచడము.
- పశు వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి వ్యాధి నిరోధక టీకాలు, నట్టల నీవారణ మందుల ద్వారా పశువుల మరణ శాతాన్ని తగ్గించడము.
- పశు గ్రాస ఉత్పత్తిని పెంపొందించడం తద్వారా పాడి పశువుల పోషణలో మెలకువలను రైతులకు తెలియ చేయటం.
- ప్రకృతి వైపరిత్యాల సమయములో పశువుల యొక్క మరణ శాతాన్ని తగ్గిస్తూ సహాయక చర్యలు చేపట్టడము.
- లాభ దాయక మైన పశు పోషణ పద్దతుల ఫై రైతులకు అవగాహన కల్పించడము.
- సంక్రమికవ్యాధుల నివారణ కొరకు ఆరోగ్య శాఖ తో సమన్వయం తో పని చేయడం.
- పేదరిక నిర్మూలనా పథకాలలోపశు పోషణ కొరకు శాస్త్రీయ పద్దతులను తెలియ చేయడం.
- పశు వైద్యులు మరియు పార వెటర్నరీ సిబ్బంది యొక్క వృత్తి నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంచడము.
వెబ్‌సైట్:
పశువైద్య మరియు పశుసంవర్ధక విభాగం– http://vahd.telangana.gov.in/