ముగించు

పశు వైద్య మరియు పశు సంవర్ధక శాఖ

జిల్లాలో ఆపారమైన పశు సంపద ఉన్నది. పాడి పశువుల పెంపకము సన్న, చిన్న కారు రైతులకు అదనపు ఆదాయాన్నే కాకుండా నిరుపేద వ్యవసాయ కూలీలకు జీవనోపాధిని కల్పిస్తున్నది. గొర్రెల పెంపకములో పాలమూరు జిల్లా తెలంగాణ రాష్ట్రం లోనే అగ్రగామిగా ఉన్నది. మన జిల్లాకు చెందిన గొర్రెల కాపరులు తరచూ వలస వెళ్ళినా, గొర్రెల పెంపకము లాభ సాటిగా ఉన్నది. గ్రామీణ మహిళలు కోళ్ల పెంపకము ద్వారా తమ పిల్లలకు గుడ్ల రూపంలో బలవర్ధక ఆహారాన్ని అందించడం జరుగుతుంది. బ్రాయిలర్ మరియు లేయర్ ఫారంలలో కూడా కోడి మాంసముమరియు గుడ్ల ఉత్పత్తిలో మన జిల్లా ముందంజలో ఉంది. పశు పోషణ గ్రామీణ రైతుల జీవనోపాధిని మెరుగు పరుస్తున్నదనడంలో సందేహము లేదు.

పశు సంవర్ధక శాఖ యొక్క ముఖ్య ఉద్దేశ్యము సమస్త మానవ జాతికి బలవర్ధక ఆహారమైన పాలు, మాంసము మరియు గుడ్ల రూపములో అందించడము. దీనికి గాను ప్రస్తుతము రైతుల దగ్గర ఉన్న నాసిరకం పశువుల జాతి అభివృద్ది వ్యాధి నిరోధక శక్తి పెంచడము మరియు సమర్థవంతంగా పాడి పశువుల పోషణ ద్వారా రైతుల నికర ఆదాయాన్ని పెంచడము. అంతేకాకుండా గ్రామీణ ప్రాంత రైతుల ఆర్ధిక అభివృద్ధికి ప్రభుత్వం ద్వారా అమలు చేయబడే వివిధ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం.

  • కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా జాతి అభివృద్ది చేసి తద్వారా పాడి పశువుల యొక్క ఉత్పత్తి సామర్థ్యాని పెంచడము.
  • పశు వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి వ్యాధి నిరోధక టీకాలు, నట్టల నీవారణ మందుల ద్వారా పశువుల మరణ శాతాన్ని తగ్గించడము.
  • పశు గ్రాస ఉత్పత్తిని పెంపొందించడం తద్వారా పాడి పశువుల పోషణలో మెలకువలను రైతులకు తెలియ చేయటం.
  • ప్రకృతి వైపరిత్యాల సమయములో పశువుల యొక్క మరణ శాతాన్ని తగ్గిస్తూ సహాయక చర్యలు చేపట్టడము.
  • లాభ దాయక మైన పశు పోషణ పద్దతుల ఫై రైతులకు అవగాహన కల్పించడము.
  • సంక్రమికవ్యాధుల నివారణ కొరకు ఆరోగ్య శాఖ తో సమన్వయం తో పని చేయడం.
  • పేదరిక నిర్మూలనా పథకాలలోపశు పోషణ కొరకు శాస్త్రీయ పద్దతులను తెలియ చేయడం.
  • పశు వైద్యులు మరియు పార వెటర్నరీ సిబ్బంది యొక్క వృత్తి నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంచడము.

జిల్లాలోని పశుసంపద వివరములు:

జంతువుల రకం జనాభా (లక్షలలో)
గోజాతి పశువులు 112114
గేదె జాతి పశువులు 180613
గొర్రెలు 573700
మేకలు 167824
పందులు
5600
పశుసంవర్ధక ఆస్పత్రులు
6

జిల్లాలోని నాటు/నాసిరకం యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు అన్ని పశు వైద్య శాలలు మరియు గోపాల మిత్రల ద్వారా కృత్రిమ గర్భదారణ సేవలు అందించడం జరుగుతున్నది.

పశు వైద్య మరియు పశు సంవర్ధకశాఖ– http://vahd.telangana.gov.in/

 

కామారెడ్డి జిల్లా కార్యాలయ సిబ్బంది:

క్రమ

సంఖ్య

శీర్షిక
పేరు
 

లింగం

మ/స్త్రీ

హోదా మొబైల్ నెంబర్ ఇ-మెయిల్
1 డా.
వెల్పూర్ జగన్నాథ చారి
జిల్లా పశువైద్య, పశుసంవర్ధక అధికారి
7337396422 dvaho-kmr-ahd@telangana.gov.in
2 డా.
ఖాడ్సే సంజయ్ కుమార్
సహాయ దర్శకుడు
9121213791 advah-kmr-ahd@telangana.gov.in
3 శ్రీ.
అరెగుడెమ్ యాదయ్య
సూపరింటెండెంట్ 
9247467948 supdt-kmr-ahd@telangana.gov.in
4 శ్రీ.
సోన్‌కాంబుల్ కిషన్ రావు
సీనియర్ అసిస్టెంట్ 
9490241098 sr1-kmr-ahd@telangana.gov.in
5 శ్రీ.
బిల్లీ లక్ష్మణ్ రావు
సీనియర్ అసిస్టెంట్ 9493311033 sr2-kmr-ahd@telangana.gov.in
6 శ్రీ.
కుతాడీ ప్రసాద్
సీనియర్ అసిస్టెంట్ 9110796176 sr3-kmr-ahd@telangana.gov.in