ముగించు

వ్యవసాయం

శాఖ గురించి

జిల్లాలో ఆర్థిక ఆదాయం ప్రధానంగా వ్యవసాయం ద్వారా వచ్చుచున్నది. వ్యవసాయ శాఖ ఆభివృద్ధిలో వలన జిల్లా ఆర్ధిక ఆభివృద్ధికి బాటలు పడుచున్నవి.

జిల్లాలోని వ్యవసాయ శాఖ నాణ్యమైన పంటల ఉత్పత్తికి ఆభివృద్ధికి దిగువ విధముగా తోడ్పడుచున్నది.

సోయా చిక్కుడు ఉత్పత్తి:

ఈ పంట అధిక ఉత్పత్తి మరియు ఆభివృద్ధి కొరకు గాంధారి, తాడ్వాయి, రాజంపేట, బిచ్కుంద, పెద్ద కొడప్గల్, మద్నూర్, పిట్లం మరియు సదా శివనగర్ మండలంలోని ప్రధానమైన వర్షాధారంగా పండించుటకు అనువుగానున్నవి. జిల్లాలో అనేక చోట్ల నల్ల భూములు ఉన్నందున ఈ సోయా పంట సాగుకు అనుకూలంగానున్నందున జిల్లలో ఒక సోయా చిక్కుడు పంట ఆభివృద్ధి కేంద్రము ఏర్పాటు చేయుట అవసరమై ఉన్నది. దీని ద్వారా రైతులకు లబ్ధి పొందుటకు మరియు పంటకు అధిక ధర పలుకుటకు అవకాశములు కలవు.

పప్పు ధాన్యముల ఉత్పత్తి:

జిల్లాలో ముఖ్యంగా కామారెడ్డి మరియు బిచ్కుంద డివిజన్లలో వర్షాదార పంటలైన కందులు, పెసలు, శనగలు మొదలుగునవి పంటలు బాగా పండుచున్నందున అట్టి పంటలకు అనుభందంగా పరిశ్రమల ఏర్పాటుకు ఆవకాశములు కలవు.

మొక్కజొన్న ఉత్పత్తి:

జిల్లాలోని కామారెడ్డి మరియు ఎల్లారెడ్డి డివిజనలోని మండలములలో మొక్కజొన్న పంట పండుటకు అనువుగానున్నది. ఇట్టి ప్రాంతములలో వర్షాదార పంటలకు అవకాశముంది అధిక దిగుబడి కొరకు అనుకూలమైన నేలలు ఉన్నవి.

రాష్ట్ర విత్తన క్షేత్రము:

ఈ క్షేత్రము జిల్లాలోని నాగిరెడ్డి మండలంలోని మాల్తుమ్మెద గ్రామములోనున్నది. ఇది జిల్లా కేంద్రమునకు 42 కిII మీII దూరంలో కలదు. మొత్తం విస్తీర్ణము 324.22 హెక్టార్లు. ఇది సర్వే నెంబరు 838 మరియు 834 లో కలదు. ఇట్టి విస్తీర్ణములో 24.28 హెక్టార్లు ఉద్యాన శాఖకు కేటాయించబడినది. మిగిత 299.94 హెక్టార్లలో కేవలం లిప్టు పారుదల క్రింద సాగులో కలదు.

బొప్పాసు పల్లి విత్తన కేంద్రము :

ఇది బీర్కూరు మండలములో కలదు. ఇది జిల్లా నుండి 70 కిII మీII దూరంలో కలదు. మొత్తం విస్తీర్ణము 199.60 హెక్టార్లు ఇందులో 90 హెక్టార్లు సేద్యమునకు అవునుగానున్నది. దీనికి నిజాంసాగర్ కాలువ ప్రధాన నీటి వనరు.
పై రెండు విత్తన కేంద్రములు జిల్లాకు సరిపడు వరి మరియు సోయా పంటలకు ఆధీకృత విత్తనములు సరఫరా చేయు సామర్ధ్యం కలిగి ఉన్నవి.

వెబ్ సైట్లు :

వ్యవసాయ శాఖ- http://agri.telangana.gov.in

తెలంగాణ కిసాన్ పోర్టల్- http://kisan.telangana.gov.in

వ్యవసాయ సహకార శాఖ- http://agricoop.nic.in

రైతు బంధు- http://rythubandhu.telangana.gov.in/