ముగించు

చరిత్ర

కామారెడ్డి జిల్లా చరిత్ర:

కామారెడ్డి అనే పేరు 1600 నుండి 1640 సంవత్సరములలో దోమకొండ కోటను పరిపాలించిన “చిన్న కామిరెడ్డి” నుండి వచ్చింది.ఈ ప్రదేశము పూర్వము కోడూరుగా పిలువబడేది. ప్రస్తుతం కిష్టమ్మ గుడి దగ్గర ఈ గ్రామము ఉన్నది.హరిజన వాడలో కోడూరు హనుమండ్ల గుడి ఉండేది.కామారెడ్డిలో అత్యంత ప్రాచీనమైన చరిత్ర కల్గిన దేవాలయమిది. ఈ దేవలయమే కాక (03) ఇతర దేవాలయములు కూడ కామారెడ్డిలో ఉన్నట్లు ఋజువులు కలవు.
అవి:- 1.కిష్టమ్మ గుడి. 2.వేణు గోపాలస్వామి గుడి. 3.విట్టలేశ్వర ఆలయం.కాకతీయుల పరిపాలించిన కాలములో ఈ ప్రదేశము కాకర్త్య గుండనచే పాలించబడినట్లు మాచారెడ్డి మండలము బండ రామేశ్వర పల్లి గ్రామములో గల శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయములో ఋజువులు కలవు.
కామారెడ్డి జిల్లా పునర్విభజనకు పూర్వము నిజామాబాదు జిల్లా నుండి కొత్త జిల్లాగా 11-10-2016 నుండి ఆవిర్భవించి (03) రెవెన్యూ డివిజన్లు మరియు (22) మండలములుగా మరియు కామారెడ్డి పురపాలక సంఘం (01) గా ఏర్పడినది. తదుపరి బాన్సువాడ మరియు ఏల్లారెడ్డి పట్టణములు (1) పురపాలక సంచాగా మరి ఒకటే నగర పంచాయతిగా ఏర్పడినది. రాజంపేట, బీబీపేట, రామారెడ్డి, పెద్ద కొడప్గల్, నస్రుల్లాబాద్ కోత్త మండలములతో పాటు పాత (17) మండలములతో మొత్తం (22) మండలములతో కామారెడ్డి జిల్లా అవతరించింది.

ఈ జిల్లా దేశానికి అనేక మంది స్వాతంత్య్రా సమరయోధులు, సామాజిక కార్యకర్తలను అందించింది.ఈ జిల్లా ప్రజలు ఆయుధాలతో ఆయుధాలు కలిగి ఉన్న నిజాం ప్రభుత్వ మద్దతును ఆస్వాదించిన రజాకర్లతో ధైర్యంగా పోరాడారు, చివరకు ఈ జిల్లాతో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాలతో పాటు భారత యూనియన్‌లో విలీనం అయ్యింది. ఈ జిల్లా నాయకులు మహాత్మా గాంధీ నాయకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ ప్రారంభించిన “క్విట్ ఇండియా ఉద్యమం” తో పాటు మిగిలిన తెలంగాణలో పాల్గొన్నారు.

ఉత్తరమున నిజామాబాద్, తూర్పున రాజన్న సిరిసిల్ల మరియు సిద్ధిపేట జిల్లాలు, దక్షిణాన మెదక్ జిల్లా మరియు పశ్చిమాన మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా మరియు కర్నాటక రాష్టంలోని బీదర్ జిల్లాలు సరిహద్దులుగా కలగియున్నది. జిల్లా భౌగోళిక విస్తీర్ణము 3652 చదరపు కిలోమీటర్లు. 18-19’ -07’’ అక్షాంశము మరియు 78-20’ -37’’ రేఖాంశముగా జిల్లా కలదు.