ఉద్యాన మరియు పట్టుపరిశ్రమల శాఖ
ఉద్యాన మరియు పట్టుపరిశ్రమల శాఖ గురించి
జిల్లా జాతీయ రహదారి నంబరు 44 మరియు రైల్వే లేను ద్వారా రాష్ట్ర రాజధానికి 110 కి.మీలు ఉన్నందున రవాణా సౌలభ్యం అధికంగా ఉన్నందున కాయగూర పంటలు వేయుటకు మరియు రాష్ట్ర రాజధానికి అవసరముల మేరకు సరఫరా చేయుటకు అనువుగానున్నది. ప్రధానమైన వరి, చెరుకు మొదలగు పంటలను పండించే రైతుల దృష్టి ఇట్టి కూరగాయల పంటల ఉత్పత్తికై మార్చుటకు వ్యవసాయ శాఖ అనేక చర్యలు తిసుకోనుచున్నది. ఇట్టి విషయంలో ప్రత్యేక కూరగాయ పంటల కూడళ్ళను ప్రభుత్వం ప్రోత్సహించుచున్నది. జిల్లాలో ఉల్లిగడ్డ పంట అభివృద్ధికి కూడ ఉద్యాన శాఖ పాటుపడుచున్నది.ఆయా ప్రాంతములలోని అవసరములు మరియు నేల ప్రాంతములను బట్టి ఆయా పంటల ఆభివృద్ధికి ప్రత్యేక కూడళ్ళను ఏర్పాటు చేయుట ఆవశ్యకం కలదు.
పంట కాలనీల కాన్సెప్ట్:
పంట కాలనీల భావన నేల ప్రకారం ప్రాంతాల మ్యాపింగ్ తప్ప మరొకటి కాదు, నిర్దిష్ట పంట లేదా కూరగాయల స్థానిక డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఏ పంటకు ఏ భూమి సరిపోతుందో గుర్తించడం.
పంట కూడళ్ళు ఏర్పాటు ముఖ్యోద్దేశము:
- ఆయా ప్రాంతములలో అవసరముల మేరకు ఆయా పంటల ఉత్పత్తిని పెంపొందించుట.
- తద్వారా వ్యవసాయ శాఖను లాభాల బాటలో ఉంచుటకు చేసే ప్రయత్నము.
పంట కూడళ్ళు, ద్వారా సాధించబడే అభివృద్ధి అంశములు:
- కూరగాయ మరియు పండ్ల తోటల పెంపకం ద్వారా అవసరముల మేరకు ఉత్పత్తికి దోహదపడుట.
- మానవాళి జీవనమునకై పోషక విలువలు గల పంటల ఉత్పత్తి.
- సూక్ష్మ నీటి పారుదల పద్దతి ద్వారా నీటి పారుదల కల్పించి తద్వారా కూరగాయలు మరియు పండ్ల తోటల అభివృద్ధి.
- జిల్లాలో గ్రామీణ వ్యవసాయ యువతకు తగు పని కల్పించి పండ్ల తోటల పంటల అభివృద్ధికి బాటలు వేయుట కొరకు – పంటలు కోసిన తర్వాత విక్రయ దశ వరకు పంటలు పాడవకుండ చర్యలు తీసుకొనుట మరియు పంటలకు శీతలీకరణ కేంద్రములో ఉంచి సంరక్షించుటకు చర్యలు.
- పండించిన పండ్లు మరియు కూరగాయ పంటలకు ప్రత్యేక మార్కెట్ లు ఏర్పాటు చేసి సరియైన ధరలకై ఏర్పాటు చర్యలు.
ఎమ్ ఐ డి హెచ్- టిఎస్-వార్షిక కార్యాచరణ ప్రణాళిక 2020-21 (పి.డి.ఎఫ్ 255 కె.బి.)
ఎమ్ ఐ డి హెచ్- టిఎస్- కమ్మిటెడ్ / స్పిల్ ఓవర్ ప్లాన్ (పి.డి.ఎఫ్ 251 కె.బి.)
కీ హార్టికల్చర్ గణాంకాలు:
కామారెడ్డి జిల్లాలో జిల్లా రైతులు మరియు ఇతర నిరుపేద రైతులకు నాణ్యమైన మొక్కల పదార్థాల ఉత్పత్తి కోసం ఈ క్రింది వ్యవసాయ ఉద్యానవన శాఖ పరిధిలోకి వస్తుంది.
ప్రభుత్వ హార్టికల్చర్ ఫామ్ మాల్తుమ్మెద (నాగిరెడ్డిపేట్ మండల్): గువా, దానిమ్మ, యాపిల్‌బెర్, తైగువా, మామిడి, కస్టర్డ్ ఆపిల్ మొదలైన వాటి కోసం కొత్త సీజన్ బ్లాక్‌ను పునరుద్ధరించిన వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేసింది.
వెబ్ సైట్స్ :
డిపార్ట్మెంట్ వెబ్ సైట్- http://horticulturedept.telangana.gov.in
తెలంగాణ హార్టికల్చర్ మిషన్- http://horticulture.tg.nic.in
డిపార్ట్‌మెంట్ గ్యాలరీ :