ముగించు

నియామకలు

నియామకలు
హక్కు వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
కామారెడ్డి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఇజిఎంఎం ఆధ్వర్యంలో జాబ్ మేళా.

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, కామారెడ్డి ద్వారా EGMM ఆధ్వర్యంలో డా. రెడ్డీస్ లాబరేటరీస్ లిమిటెడ్ నందు ప్రొడక్షన్ విభాగంలో ఇంటర్మీడియట్ MPC / BPC 2020 సంవత్సరము లో 60% మార్క్స్ ఉత్తీర్ణత సాధించిన వారికి ఉద్యోగ అవకాశములు కల్పిస్తున్నారు.

అర్హత:- 60% మార్కులతో ఇంటర్మీడియట్ MPC / BPC 2020 సంవత్సరం ఉత్తీర్ణులైన వారు.

సంప్రదింపు:పై అర్హతలు కలిగి ఆసక్తి గల నిరుద్యోగ యువకులు తేదీ:22-03-2021 సోమవారం రోజున కామారెడ్డి లో హోటల్ అమృతా గ్రాండ్ దగ్గర గల SRK డిగ్రీ కళాశాల నందు నిర్వహించు జాబ్ మేళాకు ఉదయం: 10.00 గం.లకు ఆధార్ కార్డ్, విద్యార్హత సర్టిఫికెట్లు మరియు (2) ఫోటోలు తీసుకోని హాజరు కావాలని కోరడమైనది.వివరాలకు 8919087069 సంప్రదించగలరు.

19/03/2021 22/03/2021 చూడు (315 KB)
కామారెడ్డి జిల్లాలో నిరుద్యోగ యువతకు జాబ్ మేళా.

కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగములో ఉద్యోగములు కలిపించేందుకు ఈ నెల 05-02-2021 న సోమవారం ఉదయము 10:30 గంటల నుండి మద్యాహ్నము 2 గంటల వరకూ కలెక్టరేట్ లోని ప్రగతి భవన్ లో గల రూమ్ నెంబర్ 202 లోని జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం కామారెడ్డి నందు జాబ్ మేళ నిర్వహించును అని జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీమతి ఎస్ షబ్న ఒక ప్రకటనలో తెలిపారు.

పోస్ట్ పేరు: ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ యూనిట్ మేనేజర్

పోస్ట్ సంఖ్య: 02

వయోపరిమితి: 25 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు

అర్హత: ఏదైనా డిగ్రీ

మరిన్ని వివరాలకు సంప్రదించండి: 8374897054, 6305743423, 7671974009.

03/02/2021 28/02/2021 చూడు (286 KB)
ఫిజియో థెరపిస్ట్ మరియు సైకియట్రిస్ట్ పోస్టులకు సంబంధిత వైద్యుల నుండి కాంట్రాక్టు నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి.

కామారెడ్డి జిల్లా లోని “పాలియేటివ్ కేర్ కార్యక్రమం” లో పని చేయుటకు ఒక ఫిజియో థెరపిస్ట్ మరియు “జిల్లా మానసిక వ్యాధుల నియంత్రణ కార్యక్రమం” లో పని చేయుటకు ఒక సైక్రియటిస్టు (మానసిక వ్యాధి నిపుణుడి) పోస్టు కోసం సంబంధిత విద్యార్హతలు గల వైద్యుల నుండి కాంట్రాక్టు పద్దతిలో నియామకాల కోసం దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి.

ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు తో పాటు తగిన అర్హతల నిజ ధృవ పత్రముల తో తేదీ : 23-02-2021 నాడు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ కు ఉదయం 11:00 గంటలకు హాజరు కావలెను.

19/02/2021 23/02/2021 చూడు (311 KB)
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ -ఇ.జి.యం.యం మరియు రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా.

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ -ఇ.జి.యం.యం మరియు రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 10.02.2021 బుధవారం నాడు హైదరాబాద్, కామారెడ్డి మరియు నిజామాబాద్ లో గల వివిధ ప్రైవేటు కంపెనీ లలో ఉద్యోగాల కొరకు సాందీపని డిగ్రీ కళాశాల లో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని తెలియజేయడమైనది.

అర్హత: పదవ తరగతి నుండి డిగ్రీ వరకు. డి/బి/ఎం ఫార్మసీ, ఎఎన్ఎం, జిఎన్ఎం, బిఎస్సి నర్సింగ్, ఐటిఐ, పాలిటెక్నిక్ డిప్లొమా, బి.టెక్ మెకానికల్/ఈఈఈ.

వయోపరిమితి: 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు

సంప్రదింపు:పై అర్హతలు కలిగి ఆసక్తి గల నిరుద్యోగ యువకులు తేదీ:10-02-2021 బుధవారం రోజున కామారెడ్డి లో హొటల్ ఇంటర్ నేషనల్ దగ్గర గల సాందీపని డిగ్రీ కళాశాల నందు నిర్వహించు జాబ్ మేళాకు ఉదయం: 10.00 గం.లకు ఆధార్ కార్డ్, విద్యార్హత సర్టిఫికెట్లు మరియు (2) ఫోటోలు తీసుకోని హాజరు కావాలని కోరడమైనది.వివరాలకు 8919087069 సంప్రదించ గలరు.

05/02/2021 10/02/2021 చూడు (539 KB)
కామారెడ్డి జిల్లాలో నిరుద్యోగ యువతకు జాబ్ మేళా.

కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగములో ఉద్యోగములు కలిపించేందుకు ఈ నెల 01-02-2021 న సోమవారం ఉదయము 10:30 గంటల నుండి మద్యాహ్నము 2 గంటల వరకూ కలెక్టరేట్ లోని ప్రగతి భవన్ లో గల రూమ్ నెంబర్ 202 లోని జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం కామారెడ్డి నందు జాబ్ మేళ నిర్వహించును అని జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీమతి ఎస్ షబ్న ఒక ప్రకటనలో తెలిపారు.

28/01/2021 01/02/2021 చూడు (264 KB)
బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీము 2020-21 విద్యా సంవత్సరమునకు గాను ఇంగ్లీషు మీడియం (English Medium) లో మిగిలిన ఖాళీలకు దరఖాస్తులు స్వీకరించబడుతున్నాయి.

బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీము 2020-21 విద్యా సంవత్సరమునకు గాను ఇంగ్లీషు మీడియం (English Medium) లో మిగిలిన ఖాళీలు 3వ తరగతిలోని (4) బాలుర మరియు (1) పి టి జి ల ఖాళీ సీటుకు భర్తి చేయుటకు దరఖాస్తులు స్వీకరించబడుచున్నవి.

ఇట్టి దరఖాస్తు ఫారంలు జిల్లా గిరిజన అభివృద్ధి కార్యాలయము, కామారెడ్డి యందు తేదీ 25-01-2021 నుండి తేదీ 30-01-2021 వరకు లభించును.

దరఖాస్తు ఫారంలు పూరించిన తర్వాత జిల్లా గిరిజన అభివృద్ధి కార్యాలయము, కామారెడ్డి నందు సమర్పించవలెను. ఇట్టి దరఖాస్తులు సమర్పించుటకు చివరి తేదీ 30-01-2021 సాయంత్రము 5.00 గం . ల వరకు తీసుకొనబడును

23/01/2021 30/01/2021 చూడు (293 KB)
కామారెడ్డిలోని వివిధ ఆసుపత్రులలో పనిచేయడానికి సి.ఏ.ఎస్(సివిల్ అసిస్టెంట్ సర్జన్స్) కోసం వాక్-ఇన్-ఇంటర్వ్యూలు

కామారెడ్డిలోని వివిధ ఆసుపత్రులలో పనిచేయడానికి కామారెడ్డి జిల్లా కలెక్టర్ మరియు ప్రభుత్వ ఆసుపత్రిసూపరింటెండెంట్ సి.ఏ.ఎస్ (సివిల్ అసిస్టెంట్ సర్జన్స్) ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీ కోసం 15-12-2020 సాయంత్రం 4.00 గంటలకు వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించారు.

పోస్ట్ పేరు: – సి.ఏ.ఎస్(సివిల్ అసిస్టెంట్ సర్జన్)(ఒప్పంద ప్రాతిపదికన)

పోస్ట్లు సంఖ్య: 04-సి.ఏ.ఎస్(సివిల్ అసిస్టెంట్ సర్జన్) మరియు 02-ఐ.సి.యూ సీ.ఏ.స్(ఎం.డీ-జి.ఎం),
సీ.ఏ.ఎస్(ఎంబిబిఎస్-డీ.టి.సీ.డీ)

అర్హత:-ఎం.బి.బి.ఎస్/ఎం.డీ

మరిన్ని వివరాలకు సూపరింటెండెంట్, జిల్లా హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ కామారెడ్డిని సంప్రదించండి.

09/12/2020 15/12/2020 చూడు (411 KB)
నర్సు ప్రాక్టీషనర్ మిడ్‌వైఫ్స్ (ఎన్‌పిఎం) శిక్షణా కార్యక్రమానికి దరఖాస్తుల ఆహ్వానం – స్టాఫ్ నర్సుల నియామకం

నర్సు ప్రాక్టీషనర్ మిడ్‌వైఫ్స్ (ఎన్‌పిఎం) శిక్షణా కార్యక్రమానికి దరఖాస్తుల ఆహ్వానం – స్టాఫ్ నర్సుల నియామకం

శిక్షణ పేరు: నర్స్ ప్రాక్టీషనర్ మిడ్‌వైఫ్స్ (ఎన్‌పిఎం) శిక్షణ

శిక్షణ వ్యవధి: 18 నెలలు

అర్హత: బి.ఎస్సి నర్సింగ్ / జి.యన్.ఎం

నియమించాల్సిన ట్రైనీల సంఖ్య (స్టాఫ్ నర్సులు): 5

వయోపరిమితి: వయస్సు 38 సంవత్సరాల క్రింద

అనుభవం: 2 సంవత్సరాల లేబర్ రూం అనుభవం (ప్రాధాన్యత)

మరిన్ని వివరాలకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ, కామారెడ్డిని సంప్రదించండి.

07/12/2020 10/12/2020 చూడు (150 KB)
కామారెడ్డి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఇజిఎంఎం ఆధ్వర్యంలో జాబ్ మేళా.

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, కామారెడ్డి ద్వారా EGMM ఆధ్వర్యంలో డా. రెడ్డీస్ లాబరేటరీస్ లిమిటెడ్ నందు ప్రొడక్షన్ విభాగంలో  BSC Chemistry 2019 మరియు 2020 సంవత్సరము లో 60% మార్క్స్ ఉత్తీర్ణత సాధించిన వారికి ఉద్యోగ అవకాశములు కల్పిస్తున్నారు.

పోస్ట్లు సంఖ్య:100

అర్హత:- 60% మార్కులతో కెమిస్ట్రీ డిగ్రీతో బిఎస్సి (2019 & 2020 సంవత్సరం ఉత్తీర్ణులైన వారు )

సంప్రదింపు:పై అర్హతలు కలిగి ఆసక్తి గల నిరుద్యోగ యువకులు తేదీ:20-11-2020 శుక్రవారం రోజున కామారెడ్డి లో హొటల్ ఇంటర్ నేషనల్ దగ్గర గల సాందీపని డిగ్రీ కళాశాల నందు నిర్వహించు జాబ్ మేళాకు ఉదయం: 10.00 గం.లకు ఆధార్ కార్డ్, విద్యార్హత సర్టిఫికెట్లు మరియు (2) ఫోటోలు తీసుకోని హాజరు కావాలని కోరడమైనది.వివరాలకు 8919087069 సంప్రదించ గలరు.

17/11/2020 20/11/2020 చూడు (257 KB)
స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్ మరియు థియేటర్ అసిస్టెంట్ యొక్క ప్రొవిజనల్ మెరిట్ జాబితా.

కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో, స్టాఫ్ నర్సు-20 ఖాళీలు, ల్యాబ్ టెక్నీషియన్-2 ఖాళీలు మరియు థియేటర్ అసిస్టెంట్-3 ఖాళీల కొరకు కాంట్రాక్టు పద్ధతిన చేపడుతున్న ఉద్యోగ నియమకాల ప్రక్రియలో భాగముగా ప్రొవిజనల్ మెరిట్ జాబితా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం – కలెక్టరేటు కార్యాలయం, కామారెడ్డి నందు నోటీసు బోర్డు పైన తేదీ 11-11-2020 నుండి 13-11-2020 వరకు ప్రదర్శించబడును.

10/11/2020 13/11/2020 చూడు (275 KB) ల్యాబ్ టెక్నీషియన్ యొక్క ప్రోవిజనల్ మెరిట్ జాబితా (443 KB) స్టాఫ్ నర్సు యొక్క ప్రోవిజనల్ మెరిట్ జాబితా (815 KB) థియేటర్ అసిస్టెంట్ యొక్క ప్రోవిజనల్ మెరిట్ జాబితా (177 KB)
కామారెడ్డి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఇజిఎంఎం ఆధ్వర్యంలో జాబ్ మేళా.

కామారెడ్డి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఇజిఎంఎం ఆధ్వర్యంలో సోమవారం 19.10.2020 న జాబ్ మేళా. రిలయన్స్ జియో కంపెనీ హైదరాబాద్‌లో పనిచేయడానికి జియో ఫైబర్ ఇంజనీర్, జియో ఫైబర్ అసోసియేట్ మరియు హోమ్ సేల్స్ ఆఫీసర్ల నియామకం కోసం.

పోస్ట్ పేరు:-జియో ఫైబర్ ఇంజనీర్, జియో ఫైబర్ అసోసియేట్ మరియు హోమ్ సేల్స్ ఆఫీసర్

అర్హత:-ఇంటర్ / డిప్లొమా / ఐటిఐ.

వయస్సు: – 18 yrs-30 yrs

స్థలం: కామారెడ్డిలోని ఆర్డీఓ కార్యాలయం సమీపంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనం.

 

16/10/2020 19/10/2020 చూడు (370 KB)
మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఉపన్యాసకులు (లెక్చరర్స్ ) నియామకం.

మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఉపన్యాసకులు (లెక్చరర్స్ ) నియామకం.ఆసక్తి గల అభ్యర్థులు జిల్లా అల్ప సంఖ్యాక సంక్షేమ అధికారి కార్యాలయం నందు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.

పోస్ట్ పేరు: – జూనియర్ కళాశాలలో ఉపన్యాసకులు (లెక్చరర్స్ )

పోస్ట్లు సంఖ్య: 15 ఎం.కం

అర్హత:- పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఎం.ఎ,  ఎం.ఎస్సీ, ఎం.కం 50%మార్కులతో పాటు) బి.ఎడ్

అనుభవం : ఏదైనా జూనియర్ కళాశాలలో బోధనలో 3 సంవత్సరాల అనుభవం

మరిన్ని వివరాలకు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కామారెడ్డిని సంప్రదించండి.

02/08/2020 04/08/2020 చూడు (295 KB)