ముగించు

ప్రెస్ నోట్స్

ప్రెస్ నోట్స్
హక్కు వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
2014-15 నుండి 2019-20పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనముల దరఖాస్తులను గిరిజన సంక్షేమ శాఖ నందు సమర్పించాలని తెలిపారు.

కామారెడ్డిలో గిరిజన విద్యార్థి విద్యార్థులకు మరియు కళాశాల యాజమాన్యనికి 2014-15 నుండి 2019-20 పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనముల దరఖాస్తులను 20-03-2021 లోపు గిరిజన సంక్షేమ శాఖ నందు సమర్పించాలని తెలిపారు. కావున విద్యార్థులు బయోమెట్రిక్ ఆధార్ అతేంట్టికేషన్ మీ సేవ నందు చేయించుకొని 15-03-2021 కళాశాలలో సమర్పించాలని తెలిపారు.

12/03/2021 11/04/2021 చూడు (245 KB)
మున్సిపల్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష

జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నులు వంద శాతం లక్ష్యాన్ని చేరుకునే విధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఐ ఎ ఎస్ మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

10/03/2021 10/04/2021 చూడు (529 KB)
మహాశివరాత్రి పురస్కరించుకొని జ్యోతిర్లింగాల దర్శనం చేసుకున్నజిల్లా కలెక్టర్

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ధ్యాన కేంద్రంను జిల్లా కలెక్టర్ డాక్టర్. ఏ. శరత్, ఐ ఎ ఎస్ సందర్శించారు. మహాశివరాత్రి పురస్కరించుకొని జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవడం తనకు సంతోషంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా భక్తులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు జిల్లా కలెక్టర్ తెలియజేశారు. కార్యక్రమంలో బ్రహ్మకుమారి లు, భక్తులు పాల్గొన్నారు.

11/03/2021 10/04/2021 చూడు (431 KB)
కరోనా వాక్సినేషన్, పల్లె ప్రగతి, ఉపాధి హామీ పనులపై సమీక్షా.

మైక్రో ప్లాన్ ప్రకారం కరోనా వాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ శరత్ వైద్య అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్య అధికారులు , ఎండిఓ, ఎంపిఓ, ఎఇ పంచాయతీరాజ్ అధికారులతో, కరోనా వాక్సినేషన్, పల్లె ప్రగతి, ఉపాధి హామీ పనులను సమీక్షించారు.

10/03/2021 09/04/2021 చూడు (372 KB)
అంతర్జాతీయ మహిళా దినోత్సవం.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చ్ 8 న కామారెడ్డి జిల్లాలో జరుపుకున్నారు. 2021 మార్చ్ 8 వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సత్య గార్డెన్స్లో జిల్లా మహిళా, శిశు, సంక్షేమ శాఖా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి తెలంగాణ గౌరవ అసెంబ్లీ స్పీకర్ శ్రీ. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి దఫెదర్ శోభారాజు గారు, జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ శరత్, ఐ.ఎ.ఎస్ గారు, జుక్కల్ శాసన సభ్యులు హన్మంత్ షిండే గారు, మున్సిపల్ ఛైర్పర్సన్ నిట్టు జాహ్నవి గారు, వైస్ చైర్పర్సన్ శ్రీమతి ఇందుప్రియ గారు, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి శ్రీమతి అనురాధ గారు, పాల్గొన్నారు.

08/03/2021 07/04/2021 చూడు (472 KB)
జిల్లా కలెక్టర్ గారు వివిధ పథకాలపై సంబంధిత జిల్లా అధికారులతో సమీక్షించారు.

జిల్లాలో కరోనా వాక్సినేషన్ పకడ్బందీగా నిర్వహించాలని, పట్టణాలలో గ్రామాలలో వంద శాతం టాక్స్ వసూళ్లు చేపట్టాలని, జిల్లా వైద్య అధికారులను, మున్సిపల్ కమిషనర్లను,పంచాయతీ అధికారులను జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ. శరత్, ఐ.ఏ.ఎస్ గారు ఆదేశించారు.

05/03/2021 04/04/2021 చూడు (408 KB)
ప్రపంచ వినికిడి దినోత్సవం.

తేదీ:03-03-2021 బుధవారం నాడు ప్రపంచ వినికిడి దినోత్సవం పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పోస్టరును, జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్, ఐ.ఏ.ఎస్ గారు ఆవిష్కరించారు.

03/03/2021 02/04/2021 చూడు (322 KB)
కంపోస్ట్ షెడ్, పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామాల పరిశీలినా.

దోమకొండ మండల కేంద్రంలోని కంపోస్ట్ షెడ్, పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామంలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఐ.ఏ.ఎస్ గారు తనిఖీ చేశారు. సీతారాం పల్లిలోని నర్సరీని పరిశీలించారు.బిబిపేట జోన్ జనగామ నర్సరీలను పరిశీలించారు.

03/03/2021 02/04/2021 చూడు (540 KB)
వీడ్కోలు సమావేశం.

శనివారం అనగా 06-03-2021 నాడు అసిస్టెంట్ కలెక్టరు హేమంత్ కేశవ్ పాటిల్ గారి శిక్షణ కాలము ముగిసినందున వీడ్కోలు సమావేశం జనహిత భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా అసిస్టెంట్ కలెక్టరును జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్, ఐ.ఏ.ఎస్ గారు, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు వెంకటేష్ దోత్రే గారు, బాన్సువాడ ఆర్డీఓ రాజాగౌడ్ గారు, జిల్లా అధికారులు సన్మానించి సాదరంగా వీడ్కోలు పలికారు.

06/03/2021 31/03/2021 చూడు (346 KB)
“వయోశ్రేష్ట సమ్మాన్” అవార్డు.

2020-21 సంవత్సరమునకు గాను వయో వృద్దులకు సేవలు అందిస్తున్న వివిధ స్వచ్చంద సంస్థలు, సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్స్ మరియు వ్యక్తులలో ఉత్తమమైన సేవలు అందిస్తున్న వారికి వికలాంగుల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వయో శ్రేష్ట సమ్మాన్ అవార్డుతో సన్మానించడం జరుగుతుంది. కావున ఇట్టి అవార్డు పొందుటకు గాను సదరు వ్యక్తులు / సంస్థలు నిర్ణీత దరఖాస్తు ఫారమునకై జిల్లా సంక్షేమ అధికారి, మహిళా ,శిశు, దివ్యాంగుల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ కామారెడ్డి కార్యాలయమును సంప్రదించి పూరించిన దరఖాస్తు ఫారమును ఈ కార్యాలయమునకు సమర్పించగలరు.

10/03/2021 31/03/2021 చూడు (298 KB)
గిరిజన అభ్యర్థులకు ఎస్.టి కార్పొరేషన్ కామారెడ్డి ద్వారా ఆర్థిక సహాయ పథకం.

ఇందుమూలంగా తెలియచేయునది ఏమనగా 2020-2021 ఆర్థిక సంవత్సరానికి గాను కామారెడ్డి జిల్లా లో (169) గిరిజన అభ్యర్థులకు ఎస్.టి. కార్పొరేషన్ కామారెడ్డి ద్వారా ఆర్థిక సహాయ పథకం (ఎకనామిక్ సపోర్ట్ స్కీం ) ద్వారా వ్యవసాయ సంబంధ పశు సంవర్థక చిన్న నీటి పారుదల మరియు చిరు వ్యాపారము మొదలకు పథకములకు ఆన్లైన్ ధరఖాస్తులను కోరబడుచున్నవి.

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోడానికి ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయండి : https://tsobmms.cgg.gov.in/

ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ యొక్క గడువు తేదీ:15-03-2021 నుండి 31-03-2021 వరకు ప్రభుత్వం పొడగించినది.

15/03/2021 31/03/2021 చూడు (306 KB)
ఉర్దూ ఆన్లైన్ బేసిక్ కోర్సు ఉర్దూ అకాడమీ ద్వారా.

తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మరియు సెక్రటరీ గారి సూచనలు మరియు జిల్లా అల్ప సంఖ్యా సంక్షేమ శాఖా అధికారిని గారి ఆదేశాల మేరకు, ఉర్దూ ఆన్లైన్ బేసిక్ కోర్సును ఉర్దూ అకాడమీ ద్వారా ప్రారంభించినట్లు ఒక పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు.

ఉర్దూ నేర్చుకోవాలనుకునే వారు https://ecourse.urduacademyts.com వెబ్సైటు లో రిజిస్ట్రేషన్ తర్వాత ఈ కోర్సును నేర్చుకోవచ్చు.

16/03/2021 31/03/2021 చూడు (408 KB)