ముగించు

శ్రీ సోమలింగేశ్వర స్వామి ఆలయం, దుర్కి (గ్రామం), నస్రుల్లాబాద్ (మండలం)

దిశలు
వర్గం చరిత్ర ప్రసిద్ధమైనవి, ధార్మిక
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని దుర్కి గ్రామం ఎంతో చారిత్రక ప్రాముఖ్యత గల గ్రామం. పూర్వం దుర్కి గ్రామంలో సప్త ఋషులలో ఒకడైన దూర్వాస మహర్షి(ఆత్రి) ఉంటూ తపస్సు చేసుకునేవాడని ప్రతీతి. అందుకే ఈ ఊరుకు కూడా దూర్వాసుని పేరు మీదుగా దుర్కి అనే పేరొచ్చిందని అంటుంటారు. దుర్కి గ్రామ శివారులో సోమలింగేశ్వరాలయం ఉంది. ఈ ఆలయం కళ్యాణి చాణుక్యుల కాలం నాటిదని చరిత్రకారులు వెల్లడించారు.
 
కాకతీయుల కాలంలో బాన్సువాడ, కోటగిరి, వర్ని ప్రాంతాలను సోమనాథుడు అనే రాజు పరిపాలిoచేవాడు. ఆ రాజుకు పుత్ర సంతానం లేకపోవడంతో ప్రస్తుత ఆలయ స్థలంలో తపస్సు చేస్తుండగా శివుడు ప్రత్యక్షమై సంతాన భాగ్యం కల్పించాడట. దీంతో ఆ రాజు తనకు పుట్టిన కుమారులకు సోమేశ్వరులుగా నామకరణం చేశాడని చరిత్ర ఉంది. మూడో సోమేశ్వరుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని తెలుస్తోంది.
 
ఈ ఆలయం మొత్తం రాతితో నిర్మించబడి ఉంది. హిందూ దేవాలయాల ముఖద్వారాలు సాధారణంగా తూర్పు వైపు ఉంటాయి. కానీ ఈ ఆలయ ద్వారం మాత్రం పడమర వైపు ఉండటం విశేషం. ఈ ఆలయంలోని ప్రధాన శివలింగం 50 ఏండ్ల క్రితం పిడికిలి మందంలో ఉండేదని, అది దినదినాభివృద్ధి చెందుతోందని స్థానికులు చెబుతారు. ఆలయంలో ఇంకా పార్వతి దేవి, గణపతి విగ్రహాలున్నాయి. ఆలయ ప్రాంగణంలో అష్టముఖీ లింగంతో పాటు వివిధ ఆకారాల్లో ఉన్న మరికొన్ని లింగాలు ఉండటం విశేషం.
 
ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం శివరాత్రి వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. ఈ వేడుకలకు జిల్లా నుండే కాకుండా పొరుగు జిల్లాలతో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక మొదలగు ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు. మాఘమాసం,కార్తీక పౌర్ణమి, సోమవారాల్లో ఈ ఆలయం భక్తులతో నిండిపోతుంది.

ఛాయా చిత్రాల ప్రదర్శన

  • శ్రీ సోమలింగేశ్వర స్వామి ఆలయం, దుర్కి గ్రామం,నస్రుల్లాబాద్ మండలం
  • శ్రీ సోమలింగేశ్వర స్వామి ఆలయం, దుర్కి గ్రామం,నస్రుల్లాబాద్ మండలం
  • శ్రీ సోమలింగేశ్వర స్వామి ఆలయం, దుర్కి గ్రామం,నస్రుల్లాబాద్ మండలం

ఎలా చేరుకోవాలి?:

గాలి ద్వారా

ప్రస్తుతం, కామారెడ్డిలో ఫంక్షనల్ విమానాశ్రయం లేదు. 118 కిలోమీటర్ల దూరంలో నాందేడ్ లోని శ్రీ గురు గోవింద్ సింగ్ జి విమానాశ్రయం సమీప విమానాశ్రయం. మరియు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్, నస్రుల్లాబాద్ నుండి 176 కిలోమీటర్ల దూరంలో ఉంది.

రైలులో

మీరు రైలులో ప్రయాణించడం ద్వారా సికింద్రాబాద్ (ఎస్సీ) లేదా కాచెగూడ (కెసిజి) నుండి కామారెడ్డికి చేరుకోవచ్చు. సికింద్రాబాద్ నుండి కామారెడ్డికి వెళ్లే రైలు సుమారు 2 గంటల 15 నిమిషాలు పడుతుంది. మరియు సికింద్రాబాద్ (ఎస్సీ) లేదా కాచెగూడ (కెసిజి) నుండి నిజామాబాద్ చేరుకోవచ్చు. సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్లే రైలుకు 3 గంటలు పడుతుంది.

రోడ్డు ద్వారా

దుర్కి గ్రామం బాన్సువాడ నుండి నిజామాబాద్ మరియు బోధన్ రహదారికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది, నిజామాబాద్ నుండి దుర్కి గ్రామం 45 కిలోమీటర్లు, కామారెడ్డి నుండి దుర్కి గ్రామం 63 కిలోమీటర్లు మరియు రహదారి ద్వారా చేరుకోవచ్చు.

దృశ్యాలు